స్వాగతం...సుస్వాగతం

ఎందరో మహానుభావులు అందరికి నా వందనములు.

'నా అంతర్వాహిని' చూస్తున్నందుకు కృతజ్ఞతలు... మీ సాయి
వినోద్.

Saturday 29 December 2012

మార్చలనుకునేవాల్లందరూ ముందు మారండిరా బాబు:

మార్చలనుకునేవాల్లందరూ ముందు మారండిరా బాబు: 

క్యోటో నుంచి కోపెంహగెన్ వరకు
మొదటి తెలుగు మహాసభ నుంచి నాలుగవ మహాసభ వరకు
అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు
మనసు నుంచి మెదడు వరకు
ప్రకృతికి సంభంధం అయిన బాష సంబంధం అయిన బ్రతుకు సంబంధమైన
ప్రతి సమావేశంలో
ప్రతి సమాలోచనలో
ప్రతి సభలో
ప్రతి గుండెలో
ప్రతి గొంతుకలో


"మారుతున్నవి ఆశయాలే ఆలోచనలు కాదు"


స్రీ, శిశు మనుగడకు, ప్రకృతి మనుగడకు , బాష-సంసృతి మనుగడకు 'ఆశయాలు మారడం కాదు ఆలోచనలు మారాలి ఆశయాలను నొక్కి చెబుతున్న రాజకీయ నాయకుల ఆలోచనలు మారాలి!!


బాష బ్రతుకు ప్రశ్నార్ధకం అవుతుంటే సభల పేరుతో సమావేశాల మాటులో "సమాధానాలు పూరించని ప్రశ్నలు వేసుకుంటున్న వ్యక్తుల వక్తల ఆలోచనలు మారాలి!"



మార్పు తెచ్చేది మార్చేది మేమే అంటున్న నాయకులు మారాలి!!


సభలను పండుగల మార్పులకు నాందిలా చూపిస్తున్న దృశ్య, పత్రికల ఆలోచనలు మారాలి!!


చివరకు వీటిని చూస్తూ ఆనందిస్తూ పొంగిపోతున్న సామాన్య మనిషి ఆలోచనలు మారాలి!

కాగితాలకే పరిమితమవుతున్న ఆశయాలు అంతర్వహినిలో అంతర్లీనమై ఉన్న పాత నీటిని పారదోలి కొత్త నీటికి నీతికి నేటికి పురుడు పోసే భావాలకు ప్రాణం పొయ్యాలి! అలా జరిగితేనే సభకు సమావేశానికి సమాలొచనకి గుండెకు గొంతుకు ఓ అర్థం పరమార్థం ఉండేది వచ్చేది!