స్వాగతం...సుస్వాగతం

ఎందరో మహానుభావులు అందరికి నా వందనములు.

'నా అంతర్వాహిని' చూస్తున్నందుకు కృతజ్ఞతలు... మీ సాయి
వినోద్.

Wednesday 30 November 2011

నువ్వు – నేను:


ఎవరి కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు?
         అల తీరం కోసమా ?
         తీరం అల కోసమా?
ఎవరితో ఎవరు దాగుడుమూతలు ఆడుకుంటున్నారు?
             అల తీరం తోన ?
            తీరం అల తోన ?
ఎవరి కోసం ఎవరు నిరీక్షిస్తున్నారు?
         అల తీరం కోసమా ?
           తీరం అల కోసమా?
ఎవరు ఎవరిని కవ్విస్త్తు ఉన్నారు?
          అల తీరాన్న?
             తీరం అలన?
ఇక్కడ
          అల నువ్వు !!!
          తీరం నేను నా హృదయం !!!!

"అల తీరాన్ని తాకినప్పుడు అలజడి కి చెరిగిపోయే పాద ముద్రలు మన జ్ఞాపకాలు..."
                                                                                                                    - 30/11/2011