స్వాగతం...సుస్వాగతం

ఎందరో మహానుభావులు అందరికి నా వందనములు.

'నా అంతర్వాహిని' చూస్తున్నందుకు కృతజ్ఞతలు... మీ సాయి
వినోద్.

Saturday 29 December 2012

మార్చలనుకునేవాల్లందరూ ముందు మారండిరా బాబు:

మార్చలనుకునేవాల్లందరూ ముందు మారండిరా బాబు: 

క్యోటో నుంచి కోపెంహగెన్ వరకు
మొదటి తెలుగు మహాసభ నుంచి నాలుగవ మహాసభ వరకు
అసెంబ్లీ నుంచి పార్లమెంట్ వరకు
మనసు నుంచి మెదడు వరకు
ప్రకృతికి సంభంధం అయిన బాష సంబంధం అయిన బ్రతుకు సంబంధమైన
ప్రతి సమావేశంలో
ప్రతి సమాలోచనలో
ప్రతి సభలో
ప్రతి గుండెలో
ప్రతి గొంతుకలో


"మారుతున్నవి ఆశయాలే ఆలోచనలు కాదు"


స్రీ, శిశు మనుగడకు, ప్రకృతి మనుగడకు , బాష-సంసృతి మనుగడకు 'ఆశయాలు మారడం కాదు ఆలోచనలు మారాలి ఆశయాలను నొక్కి చెబుతున్న రాజకీయ నాయకుల ఆలోచనలు మారాలి!!


బాష బ్రతుకు ప్రశ్నార్ధకం అవుతుంటే సభల పేరుతో సమావేశాల మాటులో "సమాధానాలు పూరించని ప్రశ్నలు వేసుకుంటున్న వ్యక్తుల వక్తల ఆలోచనలు మారాలి!"



మార్పు తెచ్చేది మార్చేది మేమే అంటున్న నాయకులు మారాలి!!


సభలను పండుగల మార్పులకు నాందిలా చూపిస్తున్న దృశ్య, పత్రికల ఆలోచనలు మారాలి!!


చివరకు వీటిని చూస్తూ ఆనందిస్తూ పొంగిపోతున్న సామాన్య మనిషి ఆలోచనలు మారాలి!

కాగితాలకే పరిమితమవుతున్న ఆశయాలు అంతర్వహినిలో అంతర్లీనమై ఉన్న పాత నీటిని పారదోలి కొత్త నీటికి నీతికి నేటికి పురుడు పోసే భావాలకు ప్రాణం పొయ్యాలి! అలా జరిగితేనే సభకు సమావేశానికి సమాలొచనకి గుండెకు గొంతుకు ఓ అర్థం పరమార్థం ఉండేది వచ్చేది!

Wednesday 28 March 2012

అందమైన దృశ్యం... ఆనందించే మనసుకు...ఆరాదించే కళ్ళకు...









రామాయణంలో రాముడి ప్రేమకు సాయం చేసి అలసిపోయావ లేక కలియుగంలో లేని ప్రేమ కోసం ఆరాటపడి సప్తగిరుల చెంత సేద తీరుతున్నావా మిత్రమా. సంసారసాగరంలో నీ పడవకు సరంగువై అలసిసొలసి ఇంత అందంగా ఎలా నిద్రిస్తున్నావ్. ఇంత సుందర దృశ్యాలను చూడడానికే కళ్ళు ఉన్నాయేమో...

Saturday 3 March 2012

హలో నేను గుర్తు ఉన్నానా

హలో నేను గుర్తు ఉన్నానా,

మీ నవ్వే చెబుతోంది నన్ను మీరు మరచిపోరని.

నా గురించి చెప్పనవసరం లేదు అనుకుంటా...

సో ఆలస్యం ఎందుకు...

నాతో అనుభందాలని నన్ను అనుభవిస్తూ మీరు చిన్నప్పుడు చేసిన అల్లర్లను ఒక్కసారి మళ్లీ గుర్తు చేసుకోండి.












Saturday 18 February 2012

రాజకీయ చు(మ)రకలు - "వోటు" ఉందిగా ఉపయోగించుకుంటే "మరక మంచిదే"




దీనికి "No Caption Only Action"






రండి బాబు రండి
ఆలసించిన ఆశాబంగం
        అవినీతికి, మాయమాటలకు, దోపిడీకి, కుల రాజకీయాలకు      

"తరతరాలకు చిరగని చిరునామా"
     మీ అభిమాన "ఆంధ్రప్రదేశ్"లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది!!!
This is the time for Change.
Take the "Road which is not taken".




అభివృద్ధి అనే విత్తును పెంచి పోషించడానికి బడ్జెట్ అనే ఇం"ధనం" సమపాలున లేక పోతే మన రాష్ట్ర సంక్షేమం ఇలానే ఉంటుంది!!!
మంత్రులు, అధికారుల సంక్షేమం బాగానే ఉంటుంది(ఈ చెట్టు మొండం(Trunk)లా కానీ రూపాయి చివరికి వచ్చేటప్పటికి ప్రజల సంక్షేమం ఇలా ఉంటుంది!!!



ఇవి ఎవరిని ఉద్ధేసించినవి కావు కేవలం నా కల్పిత ఆలోచనల ప్రతిరూపాలు - మన సమాజం చెప్పే నిజాలు.  




Copyrights Reserved to @Sai Vinod Gorantla 








Friday 17 February 2012

ముచ్చటగా మూడు చిత్రాలు - ముచ్చటగా మూడు సూక్తులు



భవిష్యత్తులో ధరల బారం మొయ్యాలంటే
వర్తమాన కాలంలో పుస్తకాల బరువు మోయ్యల్సిందే
ఎందుకంటే "Prevention is Better than Cure".








చితికిపోయిన కార్మిక కర్షక జీవితాలకి నేనున్నాను అంటూ ఓదార్చే ఓ విడదీయరాని బంధం
ఇంకిపోయిన వాళ్ళ కన్నీటికి నిలువెత్తు సాక్షం!!!
 

వర్తమానం భవిష్యత్తుకి అద్దం లాంటిది
నువ్వు వర్తమానంలో ఎ విత్తు నాటుతావో భవిష్యత్తులో అదే చెట్టు పండ్లను ఇస్తుంది.
"ఎ విత్తుకి ఆ చెట్టే"
 
భవిష్యత్తు అద్దంలో కనపడేది వర్తమాన ఆనవాల్లె

Saturday 4 February 2012

నేను "మూడోకన్ను" తెరిస్తే....! ఆలస్యం ఎందుకు కుసుమ సోయగాల పై ఓ లుక్కు వేయండి!


ఏమండి శివుడు మూడోకన్ను తెరిస్తే ప్రపంచం బగ్గుమంటుందో లేదో తెలియదు కానీ నేను మూడోకన్నుతెరిస్తే మాత్రం ప్రపంచం ఇలా ఉంటుంది...

ఇంతకి ఈ మూడోకన్ను గొడవ ఏంటి అనుకుంటున్నారా... చెప్పే ముందు ఇవి చూసేయండి.






















చూసేసార..చూసే ఉంటారు లెండి.. నాకోసం కాకపోయినా ప్రకృతి అందం కళ్ళని కట్టిపడేసి ఉంటుంది.
ఇంతకి మూడోకన్ను ఏంటి అనుకుంటున్నారా ఏమి లేదండి నా సోనీ సైబర్ షాట్ కెమెరా.. ముద్దుగా నేను మూడోకన్ను అని పిలుస్తా.
ఈ అందమైన ప్రదేశం ఏమిటబ్బ అని అనుకుంటున్నారా మా పల్లెటూరు అండి. ఇవి మా పల్లెటూరి 'కుసుమాల' సొగసులు
శేషచేల కొండల ప్రకృతి సోయగాల నడుమ ఓ అందమైన చిన్న పల్లెటూరు.

శాంపిల్ మాత్రమే. అసలు "అందం" ఇంకా ఉంది.. మళ్లీ కలుద్దాం...

Friday 3 February 2012

1+1 ఆలోచన.. భారతదేశా విజయానికి నాంది


రేపటి మాయలో పడి నేటిని మరువద్దు

నేడు నేడే

రేపు రేపే

"నేడు నేడులో ప్రవహిస్తే తప్ప నీ రేపటికి నేడు అనేది ఉండదు"!!!

రవి రేపటికై ఆలోచిస్తూ నేడు ఉదయించకపోతే...???

అని ఒక్కసారి ఆలోచించు నేటి విలువ ఏంటో నీకు తెలుస్తుంది!!!

II
"చదువుల తల్లిని పూజిస్తారు కానీ చదువుల తల్లికి జన్మను ఇవ్వద్దు అంటారు."
కులం పిచ్చి... నిరక్ష్యరాస్యత...కట్నం.. ఇలా ఎన్నో నమ్మకాలూ " ప్రపంచంలో 'తార'లుగా                    

వేలగాల్సిన ఎందరో చిన్నారుల ప్రాణం తీసి ధ్రువ తారలుగ వికసింప చేస్తున్నారు

                                                     - Against Female Foeticide

Thursday 2 February 2012

పాలి"ట్రిక్స్" - ఫోటోలు మాట్లాడుతాయి.




"బోడి" ఆవేదన

మన శరీరంలో మిత్రద్రోహి ఎవరో తెలుసా....?

.

.

.

“జుట్టు”...

మనతోనే పుట్టి మనతోనే పెరిగి, సొగసులు అనుభవించి

మనకన్నా ముందే పోతుంది మనమల్ని "బోడి గుండు" వేదవలని చేసి

చిప్ప కట్టింగ్ నుంచి ధోని కట్టింగ్ వరకు ఎన్ని అలంకారాలు చేసానే నీకు అలా వెళ్లిపోతావా వదలి.

క్రీం అని క్రీం అని

నెల నెల ఒక స్టైల్ అని

రింగులని straighting అని

షాంపూ లంట conditioner లంట

ఇంకా అదని ఇదని నీ పైన ఎంత తగలేశానే నా బొచ్చ

నాకు ఏమి తోచకపోతే మొదట నిన్నే పట్టుకొని గోకుతానే అలాంటి నన్ను

నడిసముద్రంలో నావను వదిలేసినట్టు పెళ్లికావాల్సిన వయసులో నన్ను విడిచి పోతావా

మనుషులకే అనుకున్న నీకు కూడా మానవత్వం, దయ, కరుణ etc etc., ఏమి లేవని చెప్తూ అలా వెళ్ళిపోతావా

ఎడారిలో 'oasis' బొచ్చు అతికిన్చేవాడు కనిపించాడు లేకుంటే నా పరిస్థితి ఏమయి ఉండేదే నా కేసమ!

బొచ్చు వ్యాపారం చేసే వాడి దగ్గర ఎంత లంచo తీసుకున్నవో ఏంటో నాకు అన్యాయం చేసి వెళ్లిపోయావ్.

ప్రతి నెల మానిఫెస్టో రాసుకొని నీ అందాన్ని కాపాడుకుంటున్నానే అలాంటి నన్ను

రాజకీయ నాయకుడు నీతి, మాట తప్పినట్టు నువ్వు నా తల తప్పి వెళ్లిపోయావ్.

నీపయి ఎవరు పరువు నష్టం దావా వెయ్యలేరు అనే కదా నీ దీమ..చెప్తా

మరో జన్మ అంటూ ఉంటె నిన్నునే పుడతనే తెగనరికి నా పగ తీర్చుకుంట!!!

---- బొచ్చు బాదితుడి ఆవేదన.

P.S - నేను చదివిన ఒక కవిత లోని ఒక వాక్యము నుండి స్ఫూర్తి పొంది రాసినది ఈ వచన కవిత. నాకు స్ఫూర్తి నిచ్చిన ఆ కవితకి, కవికి దన్యవాదములు.