స్వాగతం...సుస్వాగతం

ఎందరో మహానుభావులు అందరికి నా వందనములు.

'నా అంతర్వాహిని' చూస్తున్నందుకు కృతజ్ఞతలు... మీ సాయి
వినోద్.

Tuesday 31 January 2012

ఆశ

చిల్లులు పడిన నడిమంత్రపు సమాజం లోంచి కొత్త ప్రపంచాన్ని చూడాలని
చనిపోయిన మానవత్వానికి అమ్మనయి ప్రాణం పోయాలని
రేపటి మాయలో పడకుండ నేటికి పురుడు పోయాలని
గుండె పొరల్లో దాగి మరుగున పడిపోతున్న "ఆనందం" అనే భావాన్ని మల్లి పెదవులఫై వికసింప చేయాలనీ
పిజ్జాల బర్గర్ల మాయలో పడకుండ అమ్మ చేతి గోరుముద్దలను ఆస్వాదించాలని
ద్వేషం క్రోదం అసూయా అనే విష వలయాల నుంచి మనసును దూరంగా ఉంచాలని
ఫెసుబుక్ మత్తులో ప్లాస్టిక్ ప్రేమలకు నాంది పలకకూడదని

       ఈ "globalization" ప్రపంచం లో "నా ఆశ తీరుతుంది అంటారా?"

ఏమో చూద్దాం ఒక్కోసారి కాలం గారడి చేసే కారుణ్య మూర్తి కూడా!!!
                                                         
నా ఫోటోగ్రఫి


Tuesday 24 January 2012

పుట్టినరోజు ప్రకృతి పరిమళం

చీకటి తెరలను కప్పుకుంటూ  శాశ్వత నిద్రలోకి జారుకుంటున్న  
నేటికి సెలవు చెప్తూ కోటి ఆశల రూపమైన రేపటికి పురుడు పోస్తున్న కాలమా!!!
ధరణి ఎదపై కోటి రాగాలు పలికి మౌనరాగం ఆలపిస్తున్న విహంగమ!!!
చల్లనైన వెన్నల వెలుగులను మోస్తున్నఓ గగనమా!!!
పిల్లగాలుల చిరు తాకిడికి మైమరచి నాట్యమాడుతున్న వృక్షమా!!!
పత్రాలచాటున స్వచ్చమైన మధువును మోస్తూ వికసించడానికి సిద్దమవుతున్న పుష్పమా!!!
దినకర కిరణాలకు సప్తవర్ణాలను అద్ది ప్రతిబింబించటానికి తాపత్రేయపడుతున్న సలిలమా!!!
ప్రకృతి పరిమళాన్ని ఎల్ల వేళలా మోస్తూ మహదానందాన్ని కలిగించే వాయుమిత్రమా!!!


            సప్తసముద్రాలపై నాట్యమాడుతున్న అలలను సప్తస్వరాలుగా మలిచి, నా ఆత్మీయనేస్తం కోసం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్తారు కదూ!!!



అదేనండి బాబు ”Happy Bitrhday Tune” వినిపిస్తారు కదూ అంటున్న!!!J

విను వినిపించు "Birthday Wishes" అందించు!!!

మొదలెట్టండి మరి

Take Ur Positions

Ready 1 2 3...

                           

                          Happy Bithday to You

                         Happy Birthday to My dear Friend

                         Happy Birthday to You

                        May God Bless You

                        Happy Birthday to You

                        Happy Birthday to My dear Friend


Friday 6 January 2012

'USeless' జ్ఞాపకం

వసంత ఋతువు కోకిల గానం కోసం
చిన్న పిల్లలు ఆదివారం కోసం
పెదవులు చిరునవ్వు కోసం
శ్రామికుడు చిరుజల్లుల కోసం
తేనెటీగ మకరందం కోసం
న్యాయ దేవత న్యాయం కోసం
తీరం అలల కోసం
శ్వాస తనువు కోసం
జీవితం గమ్యం కోసం
నిముషం క్షణం కోసం
గంట నిముషాల కోసం
రోజులు గంటల కోసం
నెలలు రోజుల కోసం
జీవితం ఓ తోడూ కోసం
ఓ తోడూ కొద్దిగా నీడ కోసం
ఆకాశం చందమామ కోసం
చందమామ వెన్నల కోసం
వెన్నెల చీకటి కోసం
ఆలోచన మనుగడ కోసం
అక్షరం విప్లవం కోసం
విప్లవం అభివృద్ధి కోసం
జననం మరణం కోసం
ప్రేమ ద్వేషం కోసం
మనిషి మమత కోసం

ఇలా ప్రపంచం లో ప్రతిది దేనికో ఒక దానికోసం ఉంటుంది. Dictionary లో 'useless' అనే అక్షరానికి సరైన అర్ధం నాకు తెలిసి లేదు.
సో ఆలస్యం చేయకుండా మనం దేని కోసమో తెలుసు కొని దాని పైన ద్రుష్టి సాదిస్తే ప్రపంచం ఓ ఆనంద సాగరం, జీవితం ఆ ఆనంద సాగరం లో పయనించే ఓ మదుర విహారం.  


p.s - ఈ అంతర్వాహిని నేను నా ఇంజనీరింగ్ మూడో సంవత్సరమున మా క్లాస్సు లో రాసినది (30-08-2010). మా మాస్టారు 'useless' అనే పదం వాడినప్పుడు రాసినది.

Thursday 5 January 2012

మరువలేని మరపురాని చరిత్ర

మున్నారు ఒంపు సొంపుల పై చేసిన అల్లరులు...
కొచ్చి తీరాన పాడుకున్న పాటలు, ఆటలు...
వేగాలాండ్ లో చూసిన చేసిన అద్బుతాలు...
కావేరి నది సొంపులపై సాగిన తెట్టు యుద్దాలు...
తిరుమల కొండపై చెప్పుకున్న ఊసులు, కొండ సొగసులను ముద్దాడిన అ క్షణాలు...
Suffocation పై విరబూసిన నవ్వులు...
హైదరాబాదులో వికసించిన చిరునవ్వుల హరివిల్లులు..
గోపి సర్ కిచ్చిన వీడుకోలు ఆనందాలు ..
అప్పుడప్పుడు చేసిన మాస్ బంక్లు... కాంటీన్ కబుర్లు... కారం దోసలు... కొట్టేసిన ఐస్ క్రీములు...
సాయికిరణ్ వాళ్ళ ట్యాంక్ పై చెప్పుకున్న చేసిన హంగామాలు... వంటలు... వార్పులు...
భారతదేశం ప్రపంచకప్ గెలిచినా సందర్భాన చేసిన మరపురాని ర్యాలీలు, వేసిన కేకలు..
అర్ధరాత్రి బైక్ పై చెక్కర్లు.. కాఫీడే మీటింగ్లు.. చిట్ చాట్ లు... గొడవలు...
లైబ్రరీ లో తెలుసుకున్న ఎన్నో జీవిత సత్యాలు...
తెలియక తెలిసి చేసిన కామెంట్స్...
నాగేంద్ర, జితేంద్ర, మహేంద్ర సృష్టించిన సునామీలు...
ఫైరుగాడి ఆవేశం నుంచి వచ్చే మాటలు, క్రేజీ గాడి తలపులు(సేక్రేట్ అండి:-P)...
లచ్చిగాడి లలిత లావన్యాలు...
ఎన్నో టాం & జెర్రీ షోలు... 
డయినో భావాలు సాయికిరణ్ హావభావాలు... జానూ గాడి ఫోటోగ్రఫి లు...
అన్నాచెల్లెళ్ళ అనుభందాలు...
ఎగ్జాములో కవితలు... వచ్చిన "౦" మార్కులు...
లాస్ట్ బెంచ్ లో పుట్టిన ఇడియాలు...
తెలియని ప్రేమలు...
మాస్టర్లను ఆట పట్టించిన సందర్బాలు...
పుట్టినరోజులలో సృష్టించిన అరుపులు...
శ్రీకర్( 'శ్రీ' చందన్ + కార్తీక్) జోకులు...
ఆగిపోయిన అమ్రుతహస్తలు...
ఆవిరి అయిన స్లాం పుస్తకాల కలలు...
కాంపస్ ప్లేస్మెంట్ కబుర్లు...
కలగర్భంలో కలిసిపోయిన మదురమైన ఫోటోలు...
ఆవిరి అయిపోయిన నిజమైన స్నేహాలు... కోపాలు... తాపాలు...
ఇంజనీరింగ్ చివరి మలపులో కన్నీటి సంద్రాల నడుమ చెప్పుకున్న ఊసులు, చేసుకున్న బాసలు...
ప్రతిక్షణం ఆనందం, ఆహ్లాదం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఎములనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి...
నా ఇంజనీరింగ్ కబుర్లండి ఇవి.. ఇంకా ఎన్నో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి
                    "రాస్తే బ్లాగు సరిపోదు... రాయడం మొదలు పెదితేయ్ యుగం అయిపోదు"
సో అందుకని నా ఇంజనీరింగ్ జ్ఞాపకాల అంతర్వాహిని కి ఇక్కడితో కామ పెడుతున్న... ఉంటాను మరి... నమస్కారములు...

Wednesday 4 January 2012

జ్ఞాపకాల పందిరి

Happy Birthday

పుట్టిన రోజు శుభాకాంషలు
जन्म दिन सुभाकंशालू ...!!

ఇలా బాషలు వేరు అయిన పయి వాటికి ఉన్న అర్థం పరమార్థం ఒక్కటే

మన మొదటి ఏడుపు
అప్పుడు అమ్మ కళ్ళలోంచి
జాలువారే ఆనంద బాష్పాలు
వాటిని తుడుస్తూ మనకూ
ఒక తోడూ దొరికింది అని చెపుతున్న
నాన్న గుండెల్లో మన పై కలిగే నమ్మకం... దైర్యం
మొదటి చిరునవ్వు
అమ్మ పెట్టిన గోరుముద్దలు
నానమ్మ చెప్పిన చందమామ కధలు
మనం చూసిన దానిని ఎలాగైన
అందుకోవాలి అనే తెలియని ఆత్మవిశ్వాసంతో
పడి లేసే కెరటం మనం అందుకునే తీరు
మొట్టమొదట మనం పలికిన చిట్టి పొట్టి మాటలు
జీవిత గమ్యం వైపు అని తెలియక పోయిన  
మనం మొట్టమొదట తడబడుతూ వేసిన అడుగులు
కష్టబడి ఇంటికి వచ్చిన నాన్న మనల్నిచూడగానే
తన కష్టాన్ని అంతామరచి తన పెదవులపై విరిసే చిరునవ్వు
నవ్వుని చూడగానే ఏదో సాధించామని మన పెదవుల పై విరబూసే చిరునవ్వు
అన్నయతో ఆనందంగా గడిపిన క్షణాలు
అన్నయతో పడిన చిన్న చిన్న గొడవలు
మొదటిసారి మన స్వరం నుంచి వచ్చిన కూని రాగాలు
అమ్మ వడిలో ఒదిగి మనం నేర్చుకున్న తొలి పద్యాలూ మాటలు
ఏదో సాధించాలని అనుకోని అడుగుపెట్టిన మన తొలి బడి - తొలి రోజు చదువు
మొదటి ఫోటో
మొదటి స్నేహితుడు
మొదటి ప్రేమ
మొదటి పరీక్ష
మొదటి పుట్టిన రోజు
మొదటి రాఖి
            ఇలా ఇంకా ఎన్నో ఎన్నెన్నో చిన్ననాటి జ్ఞాపకాలను స్మృతులను గడిచిపోయిన కాలంతో పాటు మరుగున పడిపోకుండా గుర్తుంచుకోవడానికి మీ అందమైన ఫోటో ఆల్బం తీసి మీ జ్ఞాపకాలని గుర్తుచేసుకోవలసిన రోజే పుట్టిన రోజు.

విషింగ్ యు హ్యాపీ బర్త్ డే!!!!

ఆగండి.. ఆగండి మరొక్క క్షణం చివరగా మీరు గుర్తుచేసుకోవాల్సిన మరో వ్యక్తి

.

.

.

.

అదేనండి మిమ్మల్ని జాగ్రతగా బయటకి తీసి ప్రపంచానికి... అమ్మనాన్నలకి " ఇదిగో మీ బిడ్డ" అని పరిచయం చేసిన మీ డాక్టర్ అంకుల్... గుర్తుంచుకుంటారు కాదు!!!!

మళ్లీ ఇంకో అంతర్వాణి తో మీ ముందు ఉంటాను... అంతవరకు సెలవ మరి. నమస్కారములు:-)