స్వాగతం...సుస్వాగతం

ఎందరో మహానుభావులు అందరికి నా వందనములు.

'నా అంతర్వాహిని' చూస్తున్నందుకు కృతజ్ఞతలు... మీ సాయి
వినోద్.

Tuesday 3 January 2012

నేను- ప్రకృతి - నడి రేయి

  పిల్ల  కాలువలు పరవళ్ళు తొక్కుతున్న  వేళ  

  సమయం  రేపటికై పరిగెడుతున్న వేళ

  నేడు అనే బీజం లోంచి రేపు ఉదయిస్తున్న వేళ  

  పిల్ల గాలుల తాకిడికి వృక్షాల సమూహం నాట్యమాడుతున్న వేళ  

  గూడు వడిలో విహంగాల సమూహం కలల సాగరాన విహరిస్తున్న వేళ  

  నడి రేయి కోటి నక్షత్రాల వెలుగులని మోస్తున్న వేళ  

   నిదుర నా కళ్ళను ముద్దాడింది      

   ఎద లోతున  దాగి ఉన్న ఊహల విహంగానికి రెక్కలు తొడిగి  

   నిద్రలోకి జారుకుంటున్న  ఓ  ప్రేమికుడిని  నేను!!!!



No comments:

Post a Comment