స్వాగతం...సుస్వాగతం

ఎందరో మహానుభావులు అందరికి నా వందనములు.

'నా అంతర్వాహిని' చూస్తున్నందుకు కృతజ్ఞతలు... మీ సాయి
వినోద్.

Thursday 2 February 2012

"బోడి" ఆవేదన

మన శరీరంలో మిత్రద్రోహి ఎవరో తెలుసా....?

.

.

.

“జుట్టు”...

మనతోనే పుట్టి మనతోనే పెరిగి, సొగసులు అనుభవించి

మనకన్నా ముందే పోతుంది మనమల్ని "బోడి గుండు" వేదవలని చేసి

చిప్ప కట్టింగ్ నుంచి ధోని కట్టింగ్ వరకు ఎన్ని అలంకారాలు చేసానే నీకు అలా వెళ్లిపోతావా వదలి.

క్రీం అని క్రీం అని

నెల నెల ఒక స్టైల్ అని

రింగులని straighting అని

షాంపూ లంట conditioner లంట

ఇంకా అదని ఇదని నీ పైన ఎంత తగలేశానే నా బొచ్చ

నాకు ఏమి తోచకపోతే మొదట నిన్నే పట్టుకొని గోకుతానే అలాంటి నన్ను

నడిసముద్రంలో నావను వదిలేసినట్టు పెళ్లికావాల్సిన వయసులో నన్ను విడిచి పోతావా

మనుషులకే అనుకున్న నీకు కూడా మానవత్వం, దయ, కరుణ etc etc., ఏమి లేవని చెప్తూ అలా వెళ్ళిపోతావా

ఎడారిలో 'oasis' బొచ్చు అతికిన్చేవాడు కనిపించాడు లేకుంటే నా పరిస్థితి ఏమయి ఉండేదే నా కేసమ!

బొచ్చు వ్యాపారం చేసే వాడి దగ్గర ఎంత లంచo తీసుకున్నవో ఏంటో నాకు అన్యాయం చేసి వెళ్లిపోయావ్.

ప్రతి నెల మానిఫెస్టో రాసుకొని నీ అందాన్ని కాపాడుకుంటున్నానే అలాంటి నన్ను

రాజకీయ నాయకుడు నీతి, మాట తప్పినట్టు నువ్వు నా తల తప్పి వెళ్లిపోయావ్.

నీపయి ఎవరు పరువు నష్టం దావా వెయ్యలేరు అనే కదా నీ దీమ..చెప్తా

మరో జన్మ అంటూ ఉంటె నిన్నునే పుడతనే తెగనరికి నా పగ తీర్చుకుంట!!!

---- బొచ్చు బాదితుడి ఆవేదన.

P.S - నేను చదివిన ఒక కవిత లోని ఒక వాక్యము నుండి స్ఫూర్తి పొంది రాసినది ఈ వచన కవిత. నాకు స్ఫూర్తి నిచ్చిన ఆ కవితకి, కవికి దన్యవాదములు.

2 comments:

  1. Replies
    1. నాకు మొదట వచ్చిన కామెంట్. ధన్యవాదములు. మెప్పిస్తాను!

      Delete